తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహావేశాలు - ప్రపంచ తెలుగు రచయితల నాలుగో మహాసభలు

తెలుగు భాషకు అపచారం జరుగుతోందని... ఇది మన జాతికే అవమానమంటూ పలువురు సాహితీవేత్తలు ఆంధ్రప్రదేశ్​లో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో మండిపడ్డారు. పాఠశాలల్లో తెలుగు మాధ్యమం ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వారు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. మనం ఎన్నుకున్న ప్రభుత్వం... తప్పు చేస్తుంటే.. తప్పని చెప్పే దమ్మున్నవారు ఎవరూ లేరా అంటూ నిలదీశారు.

world-telugu-writers-meeting-in-vijayawada
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహావేశాలు

By

Published : Dec 28, 2019, 10:02 AM IST

'మాతృభాషను కాపాడుకుందాం - స్వాభిమానం చాటుకుందాం' అనే నినాదంతో విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల నాలుగో మహాసభలు మొదలయ్యాయి. ఈ సభలకు ప్రముఖ రచయితలు, కవులు హాజరయ్యారు. తెలుగు భాష ఔన్నత్యం గురించి మాట్లాడిన భాషా పండితులు... ఆంగ్ల మాధ్యమంపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ... మాతృభాషకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు స్పందించట్లేదని మండలి బుద్ధప్రసాద్‌ నిలదీశారు.

మౌనంగా ఉంటే లాభం లేదు...

అసలు ఆంగ్లమాధ్యమం గురించి ఎక్కడ అధ్యయనం చేశారని పాఠశాలల్లో ప్రవేశపెడతారంటూ ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రశ్నించారు. మౌనంగా ఉంటే లాభం లేదని... ప్రభుత్వాలను మార్చే శక్తి మన చేతుల్లోనే ఉందని ఆచార్య కొలకలూరి ఇనాక్‌ అన్నారు.

ప్రపంచ మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన చమత్కార చతుర్ముఖ పారాయణం, అష్టావధానం, ప్రత్యేక కవిసమ్మేళనం వంటి భాషా కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కృష్ణా జిల్లా రచయితల సంఘం సహకారంతో ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వరకూ ఈ సభలు జరగనున్నాయి.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహావేశాలు

ఇవీ చూడండి: మత్తులోకి దించి.. మట్టుబెడతాడు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details