World Kidney Day conference at lbnagar: మానవుల శరీరానికి మూత్రపిండాలే చీపుర్లు. ఇవి ఎప్పటికప్పుడు రక్తంలో ఉన్న వ్యర్థాలను వేరుచేసి, వాటిని మూత్రం ద్వారా బయటకు పంపిస్తేనే మన శరీరం ఆరోగ్యంతో ఉంటుంది. లేకపోతే చెత్త కుప్పలా తయారవుతుంది. అందుకే ఎక్కడైనా ఎవరైనా కిడ్నీల ఆరోగ్యం మీద దృష్టి సారించాలని, ఒకవేళ కిడ్నీ జబ్బు మొదలైనా తగు జాగ్రత్తలతో హాయిగా జీవించేలా చూసుకోవాలని వరల్డ్ కిడ్నీడే నినదిస్తోంది.
దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వందశాతం మందిలో ముప్పై శాతం మంది డయాబెటిస్తో బాధపడుతున్న వారిని ముందే గుర్తించినట్లయితే పూర్తిగా నయం చేయగలమని డాక్టర్ శశిధర్ తెలిపారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్బీనగర్లోని అవేర్ గ్లోబల్ హాస్పిటల్లో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సమావేశంలో 1500 రూపాయలకే కిడ్నీ స్క్రీనింగ్ ప్యాకేజీని ప్రారంభించారు. ఈ ప్యాకేజీ ద్వారా మూత్రపిండాల పని తీరును తెలుసుకోవచ్చని అవేర్ గ్లెనీగెల్స్ గ్లోబల్ ఆస్పత్రి సీఓఓ డాక్టర్ సత్వీందర్సింగ్ సబర్వాల్ తెలిపారు. ఈరోజు నుంచి మార్చి నెలాఖరు వరకు ప్యాకేజి అమలులో ఉంటుందని హాస్పిటల్ నిర్వాహకులు తెలిపారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఈ ప్యాకేజీని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో మూత్రపిండాల ఆరోగ్య గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.