పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతీ ఒక్కరూ కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ బయో డీజిల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు లింగంపల్లి చంద్రశేఖర్ కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ హిమాయత్ నగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మానవ మనుగడకు ప్రమాదకరంగా మారిన కాలుష్యాన్ని నివారించేందుకు ప్రజలందరూ కృషి చేయాలని చంద్రశేఖర్ తెలిపారు.
World environment day: హిమాయత్ నగర్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు - ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ బయో డీజిల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు లింగంపల్లి చంద్రశేఖర్
హరిత హారాన్ని బయోహారంగా మార్చి జట్రోపా మొక్కలు పెంచాలని.. ఈ పెంపకాన్ని ఉపాధి హామీలో చేర్చాలని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ బయో డీజిల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు లింగంపల్లి చంద్రశేఖర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హరితహారాన్ని బయో హారంగా మార్చి జట్రోఫా మొక్కలను పెంచాలని అన్నారు. అలాగే ఈ మొక్కల పెంపకాన్ని ఉపాధి హామీ పనిలో చేర్చాలని చంద్రశేఖర్ సూచించారు. ప్రజా రవాణాలో బయో డీజిల్ వాడడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని అందుకు జట్రోఫా మొక్కలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మొక్కల పెంపకం ద్వారా 40 సంవత్సరాల వరకు ఎలాంటి ఖర్చు లేకుండా ఆదాయం సమకూరుతుందన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక బయోడీజిల్ ఇండస్ట్రీని ఏర్పాటు చేయాలని చంద్రశేఖర్ సూచించారు.
ఇదీ చదవండి:Eatala Resignation: తెరాసతో తెగతెంపులు... నేడు ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా