తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓల్డ్ ఏజ్ హోం లో ప్రపంచ వృద్ధుల దినోత్సవం - senior citizens day

మెట్రో పాలిటన్ లీగల్ సర్వీసెస్ హైదరాబాద్, ఫాతిమా ఓల్డ్ ఏజ్ హోమ్, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. పాతబస్తీ ఫలక్​నుమాలోని ఫాతిమా ఓల్డ్ ఏజ్ హోంలోని వృద్ధులతో కలిసి ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు.

ఓల్డ్ ఏజ్ హోం లో ప్రపంచ వృద్ధుల దినోత్సవం

By

Published : Aug 21, 2019, 5:30 PM IST

ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మెట్రో పాలిటీన్ లీగల్ సర్వీసెస్ హైదరాబాద్, ఫాతిమా ఓల్డ్ ఏజ్ హోమ్, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఫలక్​నుమాలోని ఫాతిమా ఓల్డ్ ఏజ్ హోంలో వృద్ధులతో కలిసి ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జ్ ఎస్.స్వప్న రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. వైద్య శిబిరాలలో వృద్ధులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

ఓల్డ్ ఏజ్ హోం లో ప్రపంచ వృద్ధుల దినోత్సవం

ABOUT THE AUTHOR

...view details