తెలంగాణ

telangana

ETV Bharat / state

నిఖత్​ జరీన్​కు రూ. 10 లక్షల చెక్​ అందజేత - nikhath jareen latest news

Nikhath Jareen: కామన్వెల్త్​, ఒలింపిక్స్​లో పతకం సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తానని.. ప్రపంచ మహిళల బాక్సింగ్​ ఛాంపియన్​ నిఖత్​ జరీన్​ స్పష్టం చేసింది. హైదరాబాద్​ సుచిత్ర అకాడమీకి వచ్చిన నిఖత్​కు అకాడమీ యాజమన్యం రూ. 10 లక్షల చెక్కును అందించింది.

nikhanth jareen
నిఖత్​ జరీన్​

By

Published : May 28, 2022, 7:56 PM IST

Nikhath Jareen: హైదరాబాద్ సుచిత్ర అకాడమీలో ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ సందడి చేసింది. దేశం కోసం బాక్సింగ్​లో బంగారు పతకం సాధించడం సంతోషంగా ఉందని పేర్కొంది. 2009లో బాక్సింగ్ ప్రారంభించినట్లు తెలిపిన నిఖత్​.. లాక్​డౌన్ సమయంలో జిమ్​లు మూసేయడంతో సుచిత్ర అకాడమీకి వచ్చి శిక్షణ తీసుకున్నట్లు తెలిపింది. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లాంటి అకాడమీలు ఉన్నాయని నిఖత్​ చెప్పారు. కామన్వెల్త్, ఒలింపిక్స్​లో మెడల్ సాధించేందుకు కృషి చేస్తానని వెల్లడించింది. ఈ సందర్భంగా సుచిత్ర అకాడమీ యాజమాన్యం ప్రదీప్​ రాజు, ప్రవీణ్ రాజులు నిఖత్ జరీన్​కు రూ.10లక్షల చెక్​ను అందించారు.

ఇటీవల టర్కీ ఇస్తాంబుల్​లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్​షిప్​లో 52 కేజీల విభాగంలో నిఖత్ జరీన్​ స్వర్ణ పతకం సాధించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్​ మెడల్​తో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పతకం గెలిచిన తొలి బాక్సర్‌గా చరిత్ర సృష్టించింది. మొత్తం మీద ప్రపంచ మహిళల బాక్సింగ్‌లో పసిడి గెలిచిన అయిదో భారత బాక్సర్‌గా నిలిచింది నిజామాబాద్​కు చెందిన నిఖత్‌.

ABOUT THE AUTHOR

...view details