ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన తల్లితండ్రులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గెలుపొందాకా... ఇక్కడికి వస్తానని మొక్కుకున్నట్లు తెలిపారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం చేశారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు - పి.వి.సింధు
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు తన కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ సిబ్బంది ఘనస్వాగతం పలికారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు