యజ్ఞం ద్వారానే వాతావరణ కాలుష్యం... కరోనా వంటి మహమ్మారి రోగాలు దరిచేరవని విశ్వ ఫౌండేషన్ అగ్నిహోత్రుడు పురుషోత్తం పేర్కొన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లో ప్రపంచ అగ్నిహోత్ర దినోత్సవంలో భాగంగా యజ్ఞ హోమాద్రి కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై అగ్నిహోత్రంలో పాల్గొన్నారు.
యజ్ఞ యాగాదులతో పర్యావరణ పరిరక్షణ - hyderabad latest news
వేదమంత్రాల ఉచ్ఛరణ, అగ్నిహోత్ర ఆహుతితో వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చని విశ్వ ఫౌండేషన్ తెలిపింది. ప్రపంచ అగ్నిహోత్స దినోత్సవం సంస్థ సభ్యులు సందర్భంగా సికింద్రాబాద్లో ప్రత్యేక యాగాలు నిర్వహించారు.
యజ్ఞ యాగాదులతో పర్యావరణ పరిరక్షణ
పర్యావరణ పరిరక్షణ కోసం ఇలాంటి యజ్ఞాది కార్యక్రమాలు దోహదపడుతాయని ఆయన పేర్కొన్నారు. పర్యావరణంలో మార్పులు... కరోనా వైరస్ వంటి రోగాల నుంచి రక్షించుకోవడానికి ఇలాంటి యజ్ఞాలు ఉపయోగపడుతాయని... ఫౌండేషన్ సభ్యులు పేర్కొన్నారు.