హైదరాబాద్ దిల్సుఖ్నగర్లో ఉన్న క్రియేటివ్ మల్టీమీడియా కాలేజీలో రంగోలి ముగ్గులతో 'ఫొటో క్వాలిటీ చిత్రాన్ని రూపొందించడం ఎలా?' అనే అంశంపై ఐదు రోజులపాటు వర్క్ షాప్ను నిర్వహించామని సంస్థ అధ్యక్షుడు రాజశేఖర్ తెలిపారు.
రాయపూర్ నుంచి వచ్చిన ప్రముఖ రంగోలి చిత్ర నిపుణుడు.. అనేక జాతీయ,అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న ప్రసాద్ సాహూ ఈ వర్క్ షాప్ నిర్వహించారు. రంగు రంగుల ముగ్గులను ఉపయోగిస్తూ ఈయన వేసిన ఫోటో రియలిస్టిక్ చిత్రాలు ఇవి నిజంగా ఫొటోలేమో అనిపించేలా భ్రమింప చేస్తాయి. ఈ వర్క్ షాప్లో విద్యార్థిని, విద్యార్థులకు ఎంతో సులభంగా అర్థమయ్యేలా నేర్పించడం వారికి ఎంతో ఉపయోగకరమని సంస్థ అధ్యక్షుడు రాజశేఖర్ హర్షం వ్యక్తం చేశారు.