తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై కార్యశాల - హైదరాబాద్ లేటెస్ట్ న్యూస్

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై ప్రభుత్వం కార్యశాల నిర్వహిస్తోంది. స్థిరాస్తి, నిర్మాణ రంగాల సంస్థలు, ప్రతినిధులకు అవగాహన కల్పిస్తున్నారు. సందేహాలను నివృత్తి చేస్తున్నారు.

workshop-on-non-agriculture-assets-registrations-in-hyderabad
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై కార్యశాల

By

Published : Dec 17, 2020, 1:54 PM IST

Updated : Dec 17, 2020, 2:56 PM IST

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై స్థిరాస్తి, నిర్మాణ రంగాల సంస్థలు, ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది. ఇందుకోసం మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో ప్రభుత్వం ప్రత్యేక కార్యశాల నిర్వహిస్తోంది.

రిజిస్ట్రేషన్ల విధానంపై వారికి ప్రదర్శన ఇవ్వడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేస్తున్నారు. ఈ కార్యశాలలో మంత్రివర్గ ఉపసంఘ అధ్యక్షుడు వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, అధికారులతో పాటు స్థిరాస్తి, నిర్మాణ రంగాల సంస్థల సంఘాలు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ఉమ్మడి పాలమూరులో వివక్ష తగ్గింది.. చిట్టితల్లి నవ్వింది..

Last Updated : Dec 17, 2020, 2:56 PM IST

ABOUT THE AUTHOR

...view details