తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలి : తలసాని

రాష్ట్రవ్యాప్తంగా మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సికింద్రాబాద్​లోని ఎంజీ రోడ్​లో ఉన్న గాంధీ విగ్రహంకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుష్పాంజలి సమర్పించారు, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉపకులపతి గాంధీజీకి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ప్లాస్టిక్ రహిత సమాజంకై కృషి చేయాలి : తలసాని

By

Published : Oct 3, 2019, 3:15 AM IST

మహాత్మ గాంధీ స్వాతంత్య్ర సమరంలో చూపిన పటిమ ఎంతో గొప్పదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. గాంధీజీ అనేక ఇబ్బందులను ఎదుర్కొని భారతమాత విముక్తి కోసం పోరాడారని కొనియాడారు. మహాత్ముని 150వ జన్మదినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నెలకొల్పేందుకు కృషి చేయాలని మంత్రి అన్నారు. అనంతరం ప్లకార్డులను పట్టుకుని 'సే నో టూ ప్లాస్టిక్'​ అంటూ నినాదాలు చేశారు.

హైదరాబాద్ రాజేంద్రనగర్​లో జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్ రావు, మహాత్మగాంధీ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సుధీర్‌కుమార్‌ పాల్గొన్నారు. అనంతరం గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు బోధన, బోధనేతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ప్లాస్టిక్ రహిత సమాజంకై కృషి చేయాలి : తలసాని

ఇదీ చూడండి : ఆహార పదార్థాలు కలుషితమై 25 మందికి అస్వస్థత!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details