తెలంగాణ

telangana

ETV Bharat / state

బెల్​ పరిశ్రమ వద్ద బెల్​జాక్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో ధర్నా - తెలంగాణ వార్తలు

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బెల్ పరిశ్రమ ముందు బెల్ జాక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అఖిల భారత ఫెడరేషన్ దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు నిరసన ప్రదర్శన చేపట్టారు.

బెల్​ పరిశ్రమ వద్ద బెల్​జాక్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో ధర్నా
బెల్​ పరిశ్రమ వద్ద బెల్​జాక్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో ధర్నా

By

Published : Sep 18, 2020, 11:38 AM IST

దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసే ఆలోచనలు విరమించుకోవాలని డిమాండ్​ చేస్తూ సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బెల్​ పరిశ్రమ వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు.

బెల్​ మెయిన్ గేట్ ముందు గాంధీ విగ్రహం వద్ద "348" పీఎస్​యూల ప్రైవేటీకరణకు నిరసనగా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడండి, రిజర్వేషన్​లు అమలు చేయాలని ప్లకార్డులతో నిరసనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసి, రిజర్వేషన్​లను ఎత్తివేసే ఆలోచన తక్షణమే మానుకోవాలని హెచ్చరించారు.

ఇదీ చూడండి:94% మంది ఆసుపత్రికి వెళ్లకుండానే కొవిడ్​ నుంచి కోలుకుంటున్నారు

ABOUT THE AUTHOR

...view details