తెలంగాణ

telangana

ETV Bharat / state

Polavaram project: పోలవరం జలవిద్యుత్తు కేంద్రం సొరంగాల పనులు ప్రారంభం - ap news

పోలవరం జలవిద్యుత్తు కేంద్రం సొరంగాల పనులు ప్రారంభమయ్యాయి. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం అంగుళూరు కొండ వద్ద ఏపీ జెన్‌కో ఎస్‌ఈ ఎస్‌.శేషారెడ్డి పనులు ప్రారంభించారు.

polavaram works
polavaram works

By

Published : Aug 7, 2021, 10:21 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని పోలవరం ప్రాజెక్టు జలవిద్యుత్తు కేంద్రం సొరంగాల పనులను తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం అంగుళూరు కొండ వద్ద ఏపీ జెన్‌కో ఎస్‌ఈ ఎస్‌.శేషారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. జల విద్యుత్ కేంద్రంలో.. సొరంగాల తవ్వకం అత్యంత కీలకమైందన్నారు. ఇప్పటికే కొండ ప్రాంతంలో 18.90 లక్షల క్యూబిక్‌ మీటర్లు తవ్వకం పనులను మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ పూర్తిచేసిందని తెలిపారు. 960 మెగావాట్ల సామర్థ్యంతో జలవిద్యుత్తు కేంద్రం నిర్మిస్తున్న క్రమంలో 12 వెర్టికల్‌ కెప్లాన్‌ టర్బైన్లు ఉంటాయని చెప్పారు.

ఒక్కో టర్బైన్‌లో 80 మెగావాట్ల కెపాసిటీ ఉంటుందని వివరించారు. వీటిని భోపాల్‌కు చెందిన బీహెచ్‌ఈఎల్‌ సంస్థ రూపొందించిందని తెలిపారు. ఇవి ఆసియాలోనే అతిపెద్దవని, వీటికి సంబంధించి ఇప్పటికే మోడల్‌ టెస్టింగ్‌ కూడా పూర్తయిందని చెప్పారు. వీటికోసం 12 ప్రెజర్‌ టన్నెల్స్‌ తవ్వాల్సి ఉందని.. ఒక్కో సొరంగం 145 మీటర్ల పొడవున, 9 మీటర్ల డయాతో తవ్వుతున్నారని వివరించారు. వీటికి 12 జనరేటర్‌ ట్రాన్స్‌ ఫార్మర్లు ఉంటాయని.. ఒక్కోటి 100 మెగావాట్ల సామర్థ్యంతో ఉంటాయని వివరించారు. పవర్‌ ప్రాజెక్టు కోసం 206 మీటర్లు పొడవున్న అప్రోచ్‌ ఛానల్‌, 294 మీటర్ల వెడల్పున తవ్వాల్సి ఉంటుందని ఏపీ జెన్‌కో ఎస్‌ఈ ఎస్‌.శేషారెడ్డి వెల్లడించారు.

కార్యక్రమంలో ఈఈలు సోమయ్య, సి.హనుమ, ఏఈలు వై.బీమధనరావు, జలవనరులశాఖ ఈఈ పాండురంగారావు, మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ రంగరాజన్‌, జీఎం ముద్దు కృష్ణ, ఏజీఎం క్రాంతికుమార్‌, కోఆర్డినేటర్‌ ఠాగూర్‌ చంద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:Pulichintala: ప్రాజెక్టులో స్టాప్ లాక్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details