తెలంగాణ

telangana

ETV Bharat / state

'గ్రామీణ ప్రాంతాల్లోనూ తల్లిపాలపై అవగాహన కల్పించాలి'

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల అభివృద్ధికోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నాయని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ నిలోఫర్‌ ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమానికి గవర్నర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

womensday celebrations in niloper hospital
నీలోఫర్​ ఆస్పత్రిలో మహిళాదినోత్సవ వేడుకలు

By

Published : Mar 7, 2020, 8:23 PM IST

ప్రతి నెల 9న గైనకాలజిస్టులు.. పేద మహిళలకు ఉచితంగా వైద్యం చేయాలని ప్రధాని మోదీ పిలుపునివ్వడం అభినందనీయమని గవర్నర్​ తమిళిసై అన్నారు. నీలోఫర్​ ఆస్పత్రిలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.

ఆస్పత్రిలోని మిల్క్‌ బ్యాంకును సందర్శించి.. సిబ్బందిని అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇలాంటి కార్యక్రమాల ఏర్పాటు కోసం చొరవ చూపాలన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని పలువురు మహిళలను సత్కరించారు.

'గ్రామీణ ప్రాంతాల్లోనూ తల్లిపాలపై అవగాహన కల్పించాలి'

ఇదీ చూడండి:15ఏళ్లకు తిరిగొచ్చిన కొడుకు.. ఆకాశాన్నంటిన సంబరం

ABOUT THE AUTHOR

...view details