భారతదేశంలో మహిళలకు పురాణాలు, వేదాలు, ఉపనిషత్తుల్లో గొప్ప స్థానం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో ఫౌండేషన్ ఫర్ ప్యూచెరిస్టిక్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు గవర్నర్ తమిళిసై, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రతి మహిళ ఏదో ఒక రంగంలో నైపుణ్యం సంపాదించాలని సూచించారు.
'సమాజంలో మహిళలపై వివక్ష పోవాలి' - governer latest news
సమాజంలో మహిళలపై వివక్షపోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. స్త్రీ లేకపోతే జననం, గమనం, సృష్టి లేదన్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో గవర్నర్ తమిళిసైతో కలిసి వెంకయ్య పాల్గొన్నారు.

'సమాజంలో మహిళలపై వివక్షపోవాలి'
మహిళల ఉన్నతే దేశ అభ్యున్నతని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం.. దేశం, ప్రపంచం ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు.
'సమాజంలో మహిళలపై వివక్షపోవాలి'