అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి తెదేపా రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ, సీనియర్ నేతలు దుర్గాప్రసాద్, కాట్రగడ్డ ప్రసూన, నందమూరి సుహాసిని సహా పలువురు నేతలు హాజరై.. మహిళలను అభినందించారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రొఫెసర్ జ్యోత్స్న ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కొవిడ్ సమయంలో విశేష సేవలందించిన పలువురు మహిళలను సత్కరించారు. ముఖ్యంగా పోలీస్, వైద్యులు, పాత్రికేయులకు అవార్డులను అందజేశారు.
మహిళలకు తెదేపా ఎప్పుడూ పెద్దపీట వేస్తుంది: ఎల్.రమణ - WomensDay celebrations in telangana news
మహిళలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని తెతెదేపా అధ్యక్షులు ఎల్.రమణ పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొవిడ్ సమయంలో సేవలందించిన పలువురిని సత్కరించారు.
మహిళలకు తెదేపా ఎప్పుడూ పెద్దపీట వేస్తుంది: ఎల్.రమణ
ఈ సందర్భంగా మహిళలకు తెదేపా ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని ఎల్.రమణ వ్యాఖ్యానించారు. మహిళలు అన్నిరంగాల్లో రాణించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి.
ఇదీ చూడండి: 'తెలంగాణలో మహిళకు మంత్రి దక్కడానికి ఐదేళ్లు పట్టింది'
TAGGED:
తెలంగాణ తాజా వార్తలు