Women's Reservation Bill Effect on Telangana Politics 2023 : కేంద్ర మంత్రివర్గం ఆమోదంతోమహిళా రిజర్వేషన్ల బిల్లుకు మరో అడుగు ముందుకు పడినట్లైంది. మహిళా రిజర్వేషన్ల బిల్లు(Women Reservation Bill) ఆమోదం పొంది చట్టబద్దత లభిస్తే చట్టసభల్లో 33 శాతం సీట్లు మహిళలకు రిజర్వ్(33 Percent Seats Reserve For Women) కానున్నాయి. ఆ ప్రభావంతో రాష్ట్ర రాజకీయ(Telangana Politics) సమీకరణాలు సమూలంగా మారనున్నాయి. రాష్ట్ర శాసనసభలో 119 స్థానాలు ఉన్నాయి. 33 శాతం అంటే 40 సీట్లు మహిళలకు రిజర్వ్ కానున్నాయి.
ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లోనూ మహిళా రిజర్వేషన్లు(Women Reservation) అమలు కానున్నాయి. రాష్ట్రంలో ఎస్సీలకు 19, ఎస్టీలకు 12 స్థానాలు ఉన్నాయి. 33 శాతం చొప్పున ఎస్సీ నియోజకవర్గాల్లో 6, ఎస్టీ నియోజకవర్గాల్లో 4 మహిళలకు కేటాయించే అవకాశం ఉంటుంది. మిగిలిన 88 నియోజకవర్గాల్లో.. 30 స్థానాలు మహిళలకు రిజర్వ్ కానున్నాయి. అయితే మహిళలకు స్థానాల కేటాయింపు కోసం ఏ పద్ధతి అనుసరిస్తారన్నది చూడాల్సి ఉంది.
Women Reservation Bill Telangana 2023 :రాష్ట్రంలో జిల్లాల వారీగా నియోజకవర్గాల సంఖ్య విషయంలో భారీ వ్యత్యాసం ఉంది. హైదరాబాద్ జిల్లాలో ఏకంగా 15 నియోజకవర్గాలు ఉండగా.. కొన్ని జిల్లాల్లో ఒకే ఒక్క నియోజకవర్గం మాత్రమే ఉంది. తద్వారా జిల్లా యూనిట్‌గామహిళా రిజర్వేషన్లఅమలు కష్టం కావచ్చు. ఏడు అసెంబ్లీల సీట్ల చొప్పున ఉండే లోక్‌సభ(Lok Sabha) నియోజకవర్గం యూనిట్‌గా మహిళా సీట్లను కేటాయించే అవకాశం ఉండవచ్చని అంటున్నారు. సాధారణంగా ఎక్కువ మంది మహిళా ఓటర్లు(Women Voters) ఉన్న స్థానాలను మొదట మహిళలకు కేటాయించి ఆ తర్వాత రొటేషన్ విధానంలో మిగతా సీట్లను కేటాయించవచ్చు.. లేదా లాటరీ విధానంలో కేటాయింపు చేయవచ్చు.