రాజ్‌భవన్ కమ్యూనిటీ హాలులో మహిళల స్వయం ఉపాధి కార్యక్రమాన్ని గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. మహిళలు నిలదొక్కుకోవడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేసి ఆర్థికంగా ఎదగాలన్నారు. అందుకే ప్రధాన మంత్రి ఆత్మనిర్బర్ యోజన కార్యక్రమం ప్రారంభించారని తెలిపారు.
మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి: గవర్నర్
మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని గవర్నర్ తమిళిసై కోరారు. రాజ్‌భవన్ కమ్యూనిటీ హాలులో మహిళల స్వయం ఉపాధి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి: గవర్నర్
మహిళలు సంపాదించే డబ్బు పూర్తిగా కుటుంబానికి వినియోగిస్తారు చెప్పారు. కొవిడ్ బారిన పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్నారు. మహిళల స్వయం ఉపాధి కార్యక్రమంలో భాగంగా మహిళలకు కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, జ్యూట్ బ్యాగుల తయారీ, పేపర్ తో కళాకృతుల తయారీపై శిక్షణ ఇవ్వనున్నారు. ఎలీప్ వారి సహకారంతో ఈ శిక్షణ నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి:మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి నివాసంలో అనిశా సోదాలు
Last Updated : Sep 23, 2020, 1:41 PM IST