రాష్ట్రంలో లింగ నిష్పత్తి స్వల్పంగా పెరిగింది. ఐదేళ్ల క్రితం ప్రతి వెయ్యి మంది పురుషులకు 1007 మంది మహిళలు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 1049కు పెరిగింది. రాష్ట్రంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (2019-20) నివేదికను కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ విడుదల చేసింది. 2019 జూన్ 30 నుంచి నవంబరు 14 వరకు 27,351 కుటుంబాల్లోని 27,518 మంది మహిళలు, 3,863 మంది పురుషులతో సర్వే నిర్వహించింది. ఆ వివరాలను తాజాగా వెల్లడించింది.
సర్వేలోని ముఖ్యాంశాలు..
- 15 ఏళ్లలోపు చిన్నారుల జనాభా 25.1% నుంచి 22.5%నికి తగ్గింది.
- పురుషుల్లో అక్షరాస్యత 84.8%, మహిళల్లో 66.6%గా ఉంది.
- 57.4% మంది పురుషులు అంతర్జాలం (ఇంటర్నెట్) వినియోగిస్తుండగా.. మహిళలు 26.5% మంది ఉన్నారు.
- మహిళల్లో ఊబకాయుల 2015-16లో 28.6% ఉండగా.. 2019-20లో 30.1%కు పెరిగింది. పురుషుల్లో 24.2 నుంచి 32.3% పెరిగింది.
- బాలికల వివాహాలు 26.2 నుంచి 23.5 శాతానికి పెరిగాయి.
- తెలంగాణలో శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. గ్రామీణ ప్రాంతాల్లో సగటు కన్నా ఎక్కువగా 18.8గా నమోదయ్యాయి. అక్కడ ఇంకా ఇళ్లలో ప్రసవాలు జరుగుతున్నాయి.
- నవజాత శిశు మరణాలు నాలుగేళ్లలో 1000 మందికి 20 నుంచి 16.8కి తగ్గాయి. నాలుగేళ్లలోపు వయసున్న శిశు మరణాలు 31.7 నుంచి 29.4కు తగ్గాయి. నాలుగేళ్లలోపు చిన్నారులకు సరైన పోషకాహారం లభించక ఎత్తు, వయసుకు తగిన బరువు ఉండటం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరునెలల నుంచి నాలుగేళ్లలోపు చిన్నారుల్లో రక్తహీనత ఎక్కువగా ఉంది.
తీరు మారని ఆస్పత్రులు