తెలంగాణ

telangana

ETV Bharat / state

రయ్యి రయ్యిమంటూ దూసుకుపోతున్న మహిళా బైక్ రైడర్స్ - మహిళా బైక్ రైడర్స్ న్యూస్

బైక్ రైడర్ అంటే మగవారి హుందాతనం, వారికే సొంతం అనుకుంటే పొరపాటే... నేటి మహిళలు అన్నింటా ముందుండి రయ్యిమని దూసుకుపోతున్నారు. బుల్లెట్​పై సవారీ చేస్తున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడు దేశాల్లో మహిళా బైక్ రైడర్స్ బుల్లెట్​పై రైడ్ చేసి చరిత్ర సృష్టించారు. ఇలాంటి పయనాలు మరెన్నో చేస్తూ మహిళలకు స్పూర్తిగా, ఆదర్శంగా నిలుస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్​కు చెందిన జయ భారతి మహిళా రైడర్ బృందం గురించి ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

womens-day-special
రయ్యి రయ్యిమంటూ దూసుకుపోతున్న మహిళా బైక్ రైడర్స్

By

Published : Mar 8, 2020, 9:51 AM IST

బైక్​లోని హారన్​కి తెలియకపోవచ్చు... రైడర్ హెల్మెట్​లో హైడ్ అయి ఉండొచ్చు.... కానీ వారికి మెట్రోలే కాదు పెట్రోల్ కూడా తెలుసు.. బ్రేక్ ఫాస్ట్​నే కాదు బైక్ బ్రేక్స్​నీ హ్యాండిల్ చేయగలరు.. అన్నింటిలో పోటీ ఇవ్వగలం అంటున్నారు హైదరాబాద్​కు చెందిన మహిళా బైక్ రైడర్స్. ఈ బృందానికి ఊపిరి పోసింది జై భారతి. బైక్ రైడింగ్ మొదలుపెట్టి నేటికి ఏడేళ్లు. అయినా అలుపనేది లేదు. దేశ విదేశాల్లో బైక్ రైడ్ చేస్తూ వాహ్.. అనిపిస్తున్నారు.

వారి పయనం కిలోమీటర్లలో నిలవాలని కాదు.. చరిత్రపుటల్లో నిలవాలని. అత్యవసర పరిస్థితుల్లో ఎవరి కోసం వేచి చూడకూడదని.. తమ జీవితాన్నే స్వారీగా మార్చుకున్నా రు ఈ బైక్ రైడర్స్.

హైదరాబాద్​కు చెందిన జయ భారతి సాహస యాత్రల్లో చురుగ్గా పాల్గొంటారు. పలు దేశాల యునెస్కో సైట్లను సందర్శించారు. సవాలుగా తీసుకుని తానూ ఒంటరిగా పర్యటనలు చేశారు. టర్కీ, నేపాల్ వంటి దేశాల్లోనూ యాత్రలు చేశారు. జయ భారతి గురించి తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం వారి బృందానికి చక్కటి అవకాశం ఇచ్చింది. మోటర్ బైక్ రైడర్ జయ భారతి నేతృత్వంలో 7 దేశాలు, 17 వేల కిలోమీటర్లు, నలుగురు మహిళా బైక్ రైడర్లు తెలంగాణ టూరిజం ప్రమోషన్​లో భాగంగా చేసిన సాహస యాత్ర ఎవరూ మర్చిపోలేరు. ఈ తెలుగు రైడర్స్ దేశ విదేశాల్లో సత్తా చాటారు.

ఈ బుల్లెట్ రాణులు ఎలాంటి టూవీలర్స్​నైనా అవలీలగా నడిపేస్తారు. 400 సీసీ బైక్​లను రయ్యిమనిపిస్తారు. వీరు నడిపే బైక్స్​కు ప్రత్యేక గేర్లు ఉంటాయి. బుల్లెట్​పై సవారీ చేస్తూ మరెందరో మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అనేక సందర్భాల్లో మహిళలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతుంటారు. వారిలో స్ఫూర్తి పెంచేందుకు కృషి చేస్తున్నారు. మహిళా బైక్ రైడర్స్​గా వీరు ఏడవ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా జయ భారతి టీమ్ కు ఈటీవీ భారత్ ప్రత్యేక శుభాకాంక్షలు అందిస్తోంది.

రయ్యి రయ్యిమంటూ దూసుకుపోతున్న మహిళా బైక్ రైడర్స్

ఇవీచూడండి:సరదా జీవనాధారం అయింది... అందరికి ఆదర్శంగా నిలిచింది

ABOUT THE AUTHOR

...view details