నాయకురాలిగా ఎదిగిన మహిళ మరో పది మందిని నాయకురాళ్లుగా తీర్చిదిద్దాలని హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. తెలంగాణ భవన్లో తెరాస మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.
'ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తేనే మహిళలకు తగిన గౌరవం' - హైదరాబాద్ మేయర్ తాజా పర్యటన
రాజకీయాల్లో తాము మాత్రమే ఎదుగాలనుకోకుండా పేద మహిళలకు అండగా నిలవాలని హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. తెలంగాణ భవన్లో తెరాస మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.
రాజకీయాల్లో చాలా మంది అర్హులు ఉంటారని.. అయితే అవకాశాలు కొద్దిమందికే లభిస్తాయని మేయర్ విజయలక్ష్మి అన్నారు. తాము మాత్రమే ఎదగాలని కోరుకోకుండా.. పేద మహిళలకు మద్దతుగా నిలవాలన్నారు. మహిళలు విద్యావంతులు కావడంతో పాటు.. పూర్తి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తేనే తగిన గౌరవం లభిస్తుందన్నారు. ఈ సందర్బంగా పార్టీలో 2001 నుంచి ఉంటున్న కొందరికి అన్యాయం జరుగుతోందని తెరాస మహిళ విభాగం నాయకురాలు అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే ఇంట్లో అనేక మందికి పదవులు దక్కుతున్నాయని ఆరోపించారు.
ఇదీ చదవండి:'తెలంగాణలో మహిళకు మంత్రి దక్కడానికి ఐదేళ్లు పట్టింది'