మారుతున్న కాలానికి అనుగుణంగా.. మహిళలు, పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేయాలని హైదరాబాద్, సనత్నగర్ కార్పొరేటర్ లక్ష్మీ బాల్రెడ్డి సూచించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్య నగర్లోని శ్రీ మాతా సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
'మహిళలు ఇంటికే పరిమితం కాకూడదు' - మహిళా దినోత్సవ వేడుకలు
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్, సనత్నగర్లో.. శ్రీ మాతా సేవా సమితి ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ లక్ష్మీ బాల్రెడ్డి హాజరయ్యారు.
'మహిళలు ఇంటికే పరిమితం కాకూడదు'
స్త్రీలకు.. అన్ని రంగాల్లో రాణించగల శక్తి ఉందన్నారు లక్ష్మీ బాల్రెడ్డి. మహిళలు ఇంటికే పరిమితం కాకూడదని సూచించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన పలువురిని సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.