తెలంగాణ

telangana

ETV Bharat / state

సీపీ ఆఫీస్​లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు - ఆ సమయంలో 100కు ఫోన్ కొట్టాలి...

హైదరాబాద్ రాచకొండ సీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబురాలు నిర్వహించారు. బయటకు వెళ్లి వచ్చేటప్పుడు స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీపీ మహేశ్ భగవత్ సూచించారు.

ఆపదలో షీ టీమ్స్​కు ఫోన్ చేయండి : సీపీ
ఆపదలో షీ టీమ్స్​కు ఫోన్ చేయండి : సీపీ

By

Published : Mar 3, 2020, 7:44 AM IST

Updated : Mar 3, 2020, 1:46 PM IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉన్నతాధికారిణులు ఘనంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సీపీ మహేష్ భగవత్, పోలీస్ అధికారులు, జీహెచ్ ఎంసీ అధికారులు, పెద్ద సంఖ్యలో మహిళ వసతి గృహ యజమానులు పాల్గొన్నారు.

ఆ సమయంలో 100కు ఫోన్ కొట్టాలి...

స్త్రీలు బయటకెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి అపాయమున్న పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందిన 7 నిమిషాల్లో పోలీస్ వాహనం వస్తుందని తెలిపారు. హైదరాబాద్​లో షీ టీమ్స్ బాగా పనిచేస్తున్నాయని.. ఇబ్బందుల్లో ఉన్న మహిళలు సహకారం తీసుకోవాలని సూచించారు. మహిళా హాస్టల్స్ వద్ద సీసీ కెమెరాలు పెట్టాలని.. వారు ఎక్కడికి వెళ్తున్నారు.. ఎప్పుడు వస్తారు అనే సమాచారం భద్రపరుచుకోవాలన్నారు.

ఆపదలో షీ టీమ్స్​కు ఫోన్ చేయండి : సీపీ

ఇవీ చూడండి : మూడుసార్లు గర్భవతిని చేశాడంటూ ప్రియుడి కోసం ధర్నా

Last Updated : Mar 3, 2020, 1:46 PM IST

ABOUT THE AUTHOR

...view details