తెలంగాణ

telangana

ETV Bharat / state

'విద్యార్థినులు తప్పనిసరిగా మార్షల్​ ఆర్ట్స్​ నేర్చుకోవాలి'

యువతులు, మహిళలు ఎల్లప్పుడు ధైర్యంగా ఉండాలని గవర్నర్‌ తమిళిసై పేర్కొన్నారు. చెడు బుద్దితో దగ్గరికి వచ్చే వారిపై దాడులు చేసేలా ఆత్మరక్షణ మెలకువలను తెలుసుకోవాలని ఆమె సూచించారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవ ముందస్తు వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లోని కోఠి మహిళా కళాశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

women's day celebrations in koti women's college
'విద్యార్థినులు తప్పనిసరిగా మార్షల్​ ఆర్ట్స్​ నేర్చుకోవాలి'

By

Published : Mar 5, 2020, 11:41 PM IST

మహిళలు ఆత్మస్థైర్యంతో ఉంటే , అనుకున్నది సాధిస్తారని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. షీ టీమ్స్, హైదరాబాద్ నగర పోలీసు శాఖ ఆధ్వర్యంలో... కోఠి ఉమెన్స్ కాలేజీ ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు జీవితంలో ప్రతిక్షణాన్ని ఆనందంగా గడపాలని... తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని సూచించారు. సెల్ఫ్ డిఫెన్స్ కోసం విద్యార్థినులు తప్పనిసరిగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని సూచించారు.

దిశ ఘటన తనను చాలా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ యోగ, మెడిటేషన్ చేయాలని కోరారు. తాను ఒక సాధారణ మహిళనే కానీ.. నా పనితనం అసాధారణంగా ఉంటుందని వివరించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మనోస్థైర్యం కోల్పోవద్దని, లక్ష్యాలను సాధించేంతవరకు, విమర్శలను పట్టించుకోవద్దని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా గత సంవత్సరంలో వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకొనేందుకు యత్నించిన 200 మందిని కాపాడిన లేక్ పోలీస్ స్టేషన్ ఇన్​స్పెక్టర్ ధనలక్ష్మిని అభినందించారు.

నగరంలో మహిళా భద్రత కోసం పోలీస్ శాఖ నిరంతరం పని చేస్తుందని కమిషనర్​ అంజనీకుమార్​ అన్నారు. అందులో భాగంగానే షీ టీమ్, భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి, ఎలాంటి సంఘటనలు జరగకుండా పర్యవేక్షిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలను గవర్నర్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి సునీత, కోఠి ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ రాధా రాణి , ప్రముఖ వ్యాయామ శిక్షకులు దినాజ్, పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

'విద్యార్థినులు తప్పనిసరిగా మార్షల్​ ఆర్ట్స్​ నేర్చుకోవాలి'

ఇదీ చూడండి:త్రివిధ దళాల్లో...త్రిబుల్‌స్టార్‌

ABOUT THE AUTHOR

...view details