హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. మహిళలకు పదవులు ఇచ్చి గౌరవించే పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. మహిళలకు ప్రాధాన్యం ఇచ్చి పదవుల్లో కానీ, ప్రభుత్వంలో ప్రోత్సహిస్తుందని చెప్పారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అతివల కోసం ఎన్నో అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు.
మహిళలకు సమాన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనది: దేశంలో సనాతన సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను అంతర్జాతీయంగా చర్చికుంటున్నారని బండి సంజయ్ తెలిపారు. మహిళలు ఏమీ కోరుకోవడం లేదని.. కానీ వారికి సమాన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనదని వివరించారు. కొన్నిచోట్ల మహిళలను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీలో ఎంత మంది మహిళలు ఉన్నారని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంలో ఒక వికెట్ క్లీన్ బౌల్డ్ అయిందని తెలిపారు. కవిత చేసిన సారా దందా.. కేసీఆర్‌కు నచ్చిన స్కీం అని ఆరోపించారు. రాష్ట్ర మహిళల కోసం కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
"మహిళలకు పదవులు ఇచ్చి గౌరవించే పార్టీ బీజేపీ. దేశంలో సనాతన సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను అంతర్జాతీయంగా చర్చించుకుంటున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అతివలకు ఎన్నో అవకాశాలు కల్పిస్తోంది. బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీలో ఎంత మంది మహిళలు ఉన్నారు. కేసీఆర్ కుటుంబంలో ఒక వికెట్ క్లీన్ బౌల్డ్. కవిత చేసిన సారా దందా.. కేసీఆర్‌కు నచ్చిన స్కీం. రాష్ట్ర మహిళల కోసం కేసీఆర్ ఏం చేశారో చెప్పాలి."- బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు