ఏపీ అమరావతికి మద్దతుగా ఉద్యమిస్తున్న మహిళా రైతులను అవహేళన చేస్తూ... సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టినందుకు గుంటూరు జిల్లా తుళ్లూరులో ఓ యువకుడికి మహిళలు, రైతులు దేహశుద్ధి చేశారు. ఓ వైపు బతుకు పోరాటం చేస్తుంటే ఇలా అవహేళన చేయడం ఏంటంటూ అతనిపై మండిపడ్డారు.
మహిళా రైతుల పట్ల అవహేళన... యువకుడికి దేహశుద్ధి - women farmers attack on young man in tulluru
ఏపీ గుంటూరు జిల్లా తుళ్లూరులో ఓ యువకుడికి మహిళలు, రైతులు దేహశుద్ధి చేశారు. అమరావతికి మద్దతుగా ఉద్యమిస్తున్న మహిళా రైతులను అవహేళన చేస్తూ... సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడని అతనికి బుద్ధి చెప్పారు.
మహిళా రైతుల పట్ల అవహేళన... యువకుడికి దేహశుద్ధి
అమరావతి ఉద్యమం 300వ రోజున తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తుళ్లూరులోని ధర్నా శిబిరాన్ని సందర్శించారు. తమ దుస్థితిని రైతులు, మహిళలు ఆయనకు వివరించారు. ఇదే అంశాన్ని హేళన చేస్తూ... తుళ్లూరుకు చెందిన ఓ యువకుడు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడాన్ని రైతులు, మహిళలు ఆగ్రహించి దేహశుద్ధి చేశారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.
ఇదీ చూడండి:వర్షాలు తగ్గినా కొనసాగుతోన్న వరద ఉద్ధృతి