హైదరాబాద్ సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఎర్రగడ్డ న్యూప్రేమ్నగర్లోని ఓ పురాతన భవనంలో గుర్తుతెలియని మహిళ హత్యకు గురైంది. దుండగులు ఆమె మెడకు తాడు బిగించి హతమార్చినట్లు మృతదేహంపై గుర్తులున్నాయి. మృతిరాలి వయసు 35 ఏళ్లు ఉండవచ్చని భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నారు.
ఎర్రగడ్డలో గుర్తు తెలియని మహిళ దారుణ హత్య - erragadda
ఎర్రగడ్డలోని న్యూప్రేమ్నగర్లో గుర్తుతెలియని మహిళ హత్యకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
women-suspect