మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీలో విజయవాడకు చెందిన దుర్గాదేవి, బస్వరాజు అనే దంపతులు రెండేళ్లుగా నివాసముంటున్నారు. కాగా.. దుర్గాదేవి.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక విచారణలో భాగంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య
మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్థానికులు, బంధువుల ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:సచివాలయం కూల్చివేతపై దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు