తెలంగాణ

telangana

ETV Bharat / state

అనారోగ్యంతో.. మహిళ ఆత్మహత్య! - జవహర్​ నగర్​ పోలీసులు

ఆరోగ్యం బాగలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రబాద్​ జవహర్​ నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అనారోగ్య కారణాల వల్ల తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Women Suicide In Javahar Nagar Due to Health Issues
అనారోగ్యంతో.. మహిళ ఆత్మహత్య!

By

Published : Aug 18, 2020, 7:51 PM IST

సికింద్రాబాద్​ జవహర్​ నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని జనప్రియ అపార్ట్​మెంట్​లో నివసించే స్వప్న అనే మహిళ ఐదవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కౌకూర్​కు చెందిన స్వప్న గత కొద్దికాలంగా బీపీ, షుగర్​, మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నట్టు.. అనారోగ్య కారణాల వల్ల తీవ్ర మనస్తాపానికి గురై అపార్ట్​మెంట్​ పై అంతస్తుకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో అపార్ట్​మెంట్​ పై నుంచి దూకినట్లు స్థానికులు చెప్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న జవహర్​ నగర్​ పోలీసులు స్వప్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి :పిల్లల అమ్మకాలకు ఏజెంట్​ వ్యవస్థ.. 'సృష్టి'oచిన ఆసుపత్రి

ABOUT THE AUTHOR

...view details