హైదరాబాద్ నగర శివారు చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గోపన్‌పల్లి తండాలో విషాదం జరిగింది. ముప్పు అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న కంకణాల స్రవంతి (31) ఒంటికి నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడింది. భర్త కంకణాల సంతోశ్, అత్తమామల వేధింపులే స్రవంతి ఆత్మహత్యకు కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. 2017లో సంతోశ్తో స్రవంతికి వివాహం కాగా వారికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.
మనస్తాపంతో వివాహిత బలవన్మరణం.. కారణమేంటంటే..! - latest news of hyderabad
భర్త, అత్తమామలతో జరిగిన గొడవ కారణంగా మనస్తాపానికి గురైన ఓ మహిళ ఒంటికి నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ దారుణం హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన గోపన్‌పల్లి తండాలో చోటుచేసుకుంది.
మనస్తాపంతో వివాహిత బలవన్మరణం.. కారణమేంటంటే..!
అయితే సోమవారం రాత్రి స్రవంతికి భర్త సంతోశ్, అత్తమామలతో గొడవ జరగడం వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని చందానగర్ సీఐ రవీందర్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి:బాలిక అభ్యర్థనపై స్పందించిన కలెక్టర్.. స్మార్ట్ఫోన్ కానుక
Last Updated : Jul 15, 2020, 10:34 AM IST