తెలంగాణ

telangana

ETV Bharat / state

క్రీడారంగంలో మహిళలకు మరింత ప్రోత్సాహం కల్పించాలి

హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాభరణాల ప్రదర్శనను భారత త్రోబాల్ జట్టు సారథి గడ్డం ఇందుజ ప్రారంభించారు. క్రీడారంగంలో అమ్మాయిలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరముందని ఆమె అభిప్రాయపడ్డారు.

By

Published : Sep 14, 2019, 6:14 AM IST

Updated : Sep 14, 2019, 6:55 AM IST

క్రీడారంగంలో మహిళలకు మరింత ప్రోత్సాహం కల్పించాలి

క్రీడారంగంలో అమ్మాయిలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని భారత త్రోబాల్‌ టీమ్‌ కెప్టెన్‌ గడ్డం ఇందుజ అన్నారు. రాష్ట్రంలో అన్ని క్రీడలతో పాటు త్రోబాల్‌నూ ప్రోత్సహించాలని కోరేందుకు త్వరలోనే సీఎం కేసీఆర్‌ను కలువనున్నట్లు తెలిపారు. దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకొని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సిల్క్‌ అండ్‌ కాటన్‌ వస్త్రాభరణాల ప్రదర్శనను ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత ఉత్పత్తులను ఒకే చోట ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. చేనేత దుస్తులను ఎక్కువగా ఇష్టపడతానని చెప్పారు. వచ్చే నెలలో దుబాయ్‌లో జరిగే అంతర్జాతీయ త్రోబాల్‌ పోటీలకు సిద్ధమవుతున్నట్లు ఆమె వివరించారు.

క్రీడారంగంలో మహిళలకు మరింత ప్రోత్సాహం కల్పించాలి
Last Updated : Sep 14, 2019, 6:55 AM IST

ABOUT THE AUTHOR

...view details