సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కళాశాలలో మహిళా భద్రతపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా షీ టీమ్స్ డీఐజీ స్వాతి లక్రా, ఉమెన్ సేఫ్టీ వింగ్ సుమతి హాజరయ్యారు. మహిళల భద్రత ఆవశ్యకతపై విద్యార్థులు ప్రదర్శించిన నాటికలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ ఇన్ వాట్సాప్ నెంబర్ ఆవిష్కరించారు.
మహిళా భద్రతకు ప్రతీ కళాశాలలో ఓ కమిటీ: స్వాతి లక్రా - Women Safety Awareness
మహిళా భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు షీ టీమ్స్ డీఐజీ స్వాతి లక్రా తెలిపారు. ప్రతి కళాశాలలో వాలంటీర్స్ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
మహిళల భద్రతపై ప్రతి కళాశాలలో వాలంటీర్స్ కమిటీ: స్వాతి లక్రా
ప్రతీ కళాశాలలో వాలంటీర్ల కమిటీని ఏర్పాటు చేసి మహిళల భద్రత విషయాలను తెలుసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వాలంటీర్ల కమిటీల విషయంలో ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు, పోలీసులకు మధ్య అవగాహన ఉండే విధంగా కృషి చేస్తామని అన్నారు.
ఇవీ చూడండి:ఒక దీవి.. ఓ మహిళ... 31 మంది సైనికులు