అమరావతికి మద్దతుగా విజయవాడ పీడబ్ల్యూసీ మైదానం నుంచి బెంజిసర్కిల్ వరకు మహిళలు చేస్తున్న ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. మహిళలు బెంజి సర్కిల్ వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహించిన అతివలు ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద రెండు రోడ్ల కూడలిలో బైఠాయించారు. దీని వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. బెంజి సర్కిల్ వద్ద ప్రదర్శనలకు అనుమతి లేదని తెలిపారు.
వ్యక్తిగత పనులపై వెళ్తున్న మహిళలూ అరెస్టు