తెలంగాణ

telangana

ETV Bharat / state

పార్శిగుట్టలో మద్యం దుకాణంపై మహిళల నిరసన - సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ

హైదరాబాద్​ పార్శిగుట్ట వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలని స్థానిక మహిళలు ధర్నా చేశారు. వైన్స్​ ఎదుట బైఠాయించిన మహిళలపై బార్​ నిర్వహకులు దాడికి యత్నించారు. ఈ ఘటనలో ఓ వృద్ధురాలికి గాయలయ్యాయి. మహిళలకు పలు పార్టీల నాయకులు మద్దతుగా నిలిచారు.

పార్శిగుట్టలో మద్యం దుకాణంపై మహిళల నిరసన

By

Published : Nov 1, 2019, 3:01 PM IST


హైదరాబాద్ ముషీరాబాద్​లోని పార్శిగుట్ట చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణానికి వ్యతిరేకంగా మహిళలు ఆందోళన చేశారు. వైన్ షాప్ ముందు మహిళలు ధర్నా నిర్వహించారు. అదే సమయంలో సరుకుతో వచ్చిన వాహనం ముందు బైఠాయించారు. మహిళలపై వైన్ షాప్ నిర్వాహకులు మద్యం బాటిల్​తో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వృద్ధురాలు శశిరేఖకు తీవ్రగాయాలు కాగా మరో మహిళ స్వల్పకు గాయమైంది.

ప్రతిపక్షాల మద్దతు

మద్యం దుకాణం ఏర్పాటు చేయొద్దని డిమాండ్ చేస్తూ తెలంగాణ జన సమితి, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలకు చెందిన పలువురు నాయకులు మహిళలకు మద్దతుగా నిలిచారు. ప్రజల సంక్షేమానికి వ్యతిరేకంగా ప్రభుత్వం వైన్స్​, బార్​లకు అనుమతి ఇవ్వడంపై నేతలు, స్థానిక మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక అధికార పార్టీ నేతల తీరుపై మహిళలు మండిపడ్డారు.

మరోవైపు పార్శిగుట్ట సమీపంలోని మూన్​ రాక్ బార్ తెరచి ఉండడాన్ని గమనించిన మహిళలు బార్​ లోపలికి దూసుకు వెళ్లారు. లోనికి వెళ్లిన మహిళలపై వైన్స్​ నిర్వాహకులు దాడికి యత్నించగా వారు తప్పించు కున్నారు.

పార్శిగుట్టలో మద్యం దుకాణంపై మహిళల నిరసన

ఇవీ చూడండి: త్వరలో మద్యం ధరలు పెంపు..?

ABOUT THE AUTHOR

...view details