భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్లోని ముషీరాబాద్ నియోజకవర్గంలో రంగోళీ పోటీలు ఊపందుకున్నాయి. నియోజకవర్గంలోని భాజపా క్యాంపు కార్యాలయంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు.
'సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకోవాలి' - k. laxman news
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముషీరాబాద్ నియోజకవర్గంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. మహిళలు, యువతులు.. విభిన్న రంగులతో ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు.
ముగ్గుల పోటీలు, ముషీరాబాద్, లక్ష్మణ్
ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలు, యువతులు, చిన్నారులు విభిన్న రంగులతో సామాజిక అంశాలతో కూడిన ముగ్గులు వేసి తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు.