ఎన్నికల ప్రచారంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి నిరసన సెగ - అసదుద్దీన్ ఒవైసీ వార్తలు
![ఎన్నికల ప్రచారంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి నిరసన సెగ MP Asaduddin Owaisi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9632465-204-9632465-1606108823923.jpg)
10:29 November 23
ఎన్నికల ప్రచారంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి నిరసన సెగ
ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి నిరసన సెగ తగిలింది. జాంబాగ్ డివిజన్ ఎంఐఎం అభ్యర్థి రవీందర్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వరద సాయం తమకు అందలేదని ఒవైసీని మహిళలు నిలదీశారు. తాము కష్టకాలంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా... ఎన్నికల సమయంలో ఎలా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. వారికి సమాధానం ఇవ్వకుండానే ఒవైసీ వెనుదిరిగారు.
ఇదీ చదవండి :ఇవాళ జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్న కేసీఆర్