నెలసరిలో వచ్చే మార్పులపై.. మహిళలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్(ప్యూర్) సంస్థ ప్రతినిధి సంధ్య గొల్లమూడి అన్నారు. హైదరాబాద్‌లో ఈనెల 4న మహిళలు, యువతులకు.. పలు సమస్యలపై అవగాహన కల్పించే ఓ వీడియోను విడుదల చేయనున్నట్లు తెలిపారు. 'ప్యూర్ ఫెమ్మే సాంగ్' పేరిట నిర్మించిన షార్ట్ ఫిలింను.. ఉపాసన కామినేని ఆవిష్కరిస్తారని వెల్లడించారు.
'నెలసరి మార్పులపై.. అవగాహన కల్పించాల్సిన అవసరముంది' - నెలసరి మార్పులపై అవగాహన
కౌమారదశలో ఉన్న అనేక మంది బాలికలు.. రుతుస్రావంపై సరైన అవగాహన లేక.. విద్యకు దూరమవుతున్నారని 'పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్' సంస్థ ప్రతినిధి సంధ్య గొల్లమూడి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఈనెల 4న మహిళలు, యువతులకు.. పలు సమస్యలపై అవగాహన కల్పించే ఓ వీడియోను విడుదల చేయనున్నట్లు తెలిపారు.
!['నెలసరి మార్పులపై.. అవగాహన కల్పించాల్సిన అవసరముంది' Menstruation issues](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11232163-425-11232163-1617221764017.jpg)
నెలసరి మార్పులు
పాట ఆవిష్కరణతో పాటు.. పలు రంగాల్లో సేవలందించిన పలువురు మహిళలను సత్కరించనున్నట్లు సంధ్య తెలిపారు. కౌమారదశలో ఉన్న అనేక మంది బాలికలు.. రుతుస్రావంపై సరైన అవగాహన లేక.. విద్యకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. ప్యూర్ సంస్థ.. విద్యా, జీవనోపాధి, ఆర్థిక, గ్రామీణ, పట్టణ పాఠశాలలు, పిల్లల ప్రత్యేక అవసర కేంద్రాల్లో లోపాలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తోందని ఆమె వివరించారు.
ఇదీ చదవండి:సామాన్యుడికి ఊరట- తగ్గనున్న ఇంధన ధరలు!