ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలోని జోడిమెట్లలో ఉన్న ఓ వసతి గృహంలో ఖమ్మం జిల్లా జైనగర్‌కు చెందిన భవాని అనే వివాహిత స్టాఫ్ నర్సుగా పని చేస్తూ నివాసం ఉంటుంది. ఈనెల 13వ తేదీన వసతి గృహం నుంచి బయటకువెళ్లిన ఆమె తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులకు తెలియజేసిన వసతి గృహ నిర్వాహకులు చుట్టు పక్కల గాలించిన భవాని ఆచూకీ లభించలేదు. ఖమ్మంలోని గోపాలాపురం ప్రాంతానికి చెందిన భువనేశ్వర్‌కుమార్ అనే వ్యక్తి ఆమెను తీసుకెళ్లినట్లు గుర్తించిన వారి కుటుంబ సభ్యులు వారిరువురి గురించి ఎంత వెతకినా ఫలితం లేకుండా పోయింది. దీనితో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఈ మేరకు అదృశ్యం కేసు కింద నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఘట్కేసర్లో ఓ వివాహిత అదృశ్యం - హైదరాబాద్లో వివాహిత అదృశ్యం
ప్రైవేటు వసతి గృహంలో స్టాఫ్ నర్సుగా పని చేస్తున్న ఓ వివాహిత అదృశ్యంది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఘట్కేసర్లో ఓ వివాహిత అదృశ్యం