ఈనెల 16న సాయంత్రం 6 గంటలకు కువైట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఏపీ పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నెలమూరు గ్రామవాసి సాలసత్తి దుర్గ అదృశ్యమైంది. టెర్మినల్ బయటకు వచ్చి అక్కడి నుంచి కనపడడంలేదని భర్త సాలసత్తి సత్యనారాయణ గన్నవరం పోలీసులను ఆశ్రయించాడు.
కువైట్ నుంచి చేరుకుంది.. గన్నవరంలో అదృశ్యమైంది!
దుర్గ క్షేమంగా వచ్చిందా? అన్న మెసెజ్ అతన్ని ఆందోళనకు గురిచేసింది. తన భార్య తప్పిపోయిందన్న విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న భర్త.. చివరికి పోలీసులను ఆశ్రయించాడు. ఇంతకీ తప్పిపోయిన దుర్గ ఎవరు? అసలేం జరిగింది?
కువైట్ నుంచి చేరుకుంది.. గన్నవరంలో అదృశ్యమైంది!
ఈనెల 17న రాత్రి 11 గంటలకు కువైట్ నుంచి దుర్గ క్షేమంగా వచ్చిందా? అని ఆమె సహోద్యోగి పెట్టిన మెసెజ్‌తో కంగారు పడ్డ ఆమె భర్త... గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాడు. తన భార్య దుర్గ వివరాలు తెలుసుకున్నాడు. సీసీటీవీ ఫుటేజ్‌లో ఆమె వచ్చినట్లు గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ దంపతులకు బాబు, పాప ఉన్నారు.
- ఇదీ చూడండి :పులి మనిషిని చంపితే రూ.15 లక్షలివ్వాలి: అటవీ శాఖ