తెలంగాణ

telangana

ETV Bharat / state

కట్టలు తెంచుకున్న ఆగ్రహం.. మాజీ మంత్రిపై మహిళ ఫైర్ - మాజీమంత్రిపై మహిళ ఫైర్

Women Fire on Ex Minister: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో వైకాపా నేతలకు చేదు అనుభవం ఎదురైంది. ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలోని శెట్టిపల్లి, శెట్టిపల్లి తండాల్లో మాజీ మంత్రి శంకరనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. ఇంటిముందుకు వచ్చిన శంకరనారాయణను ఓ మహిళ కడిగి పారేసింది. 11 నెలలుగా పింఛన్‌ నిలిపివేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

Women Fire on Ex Minister
కట్టలు తెంచుకున్న ఆగ్రహం.. వైకాపా మాజీ మంత్రిపై మహిళ ఫైర్

By

Published : Jul 16, 2022, 5:35 PM IST

కట్టలు తెంచుకున్న ఆగ్రహం.. వైకాపా మాజీ మంత్రిపై మహిళ ఫైర్

Women Fire on Ex Minister: ఏపీ మాజీ మంత్రి శంకర నారాయణకు చేదు అనుభవం ఎదురైంది. పింఛన్‌ తీసేశారంటూ ఓ మహిళ శంకర నారాయణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. 'గడపగడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా ఏపీలోని సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం శెట్టిపల్లి తండాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పద్మాబాయి అనే మహిళ ఇంటికి వెళ్లారు. 11 నెలలుగా పింఛన్‌ నిలిపివేశారని రగిలిపోతున్న పద్మాబాయి ఇదే విషయంపై ఎమ్మెల్యేను నిలదీశారు. ఐతే మళ్లీ వస్తానంటూ శంకరనారాయణ అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నారు.

సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడంతో పద్మాబాయి ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. "నిలబడి సమాధానం చెప్పలేరా ?" అంటూ నిలదీసింది. ఇంటి సభ్యులు అంతా సముదాయిస్తున్నా ఆమె శాంతించలేదు. "ఈసారి ఓట్లడగడానికి వస్తారుగా అప్పుడు చూస్తా" అంటూ పద్మాబాయి హెచ్చరించారు. ఎమ్మెల్యేతోపాటు అధికార యంత్రాంగం మాత్రం ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేసినట్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ABOUT THE AUTHOR

...view details