తెలంగాణ

telangana

ETV Bharat / state

జెర్బారా డైసీ పూలసాగులో... ఉత్తమ రైతుగా రాణిస్తున్న మహిళ

అందరిలా కాకుండా విన్నూతనంగా ఆలోచించింది ఓ మహిళ. తన ఆలోచనను వేంటనే ఆచరించణలో పెట్టారు. తనకున్న మక్కువతో పాలీహౌస్‌ వైపు అడుగులు వేసి... అరుదుగా చేసే పూలసాగును నంద్యాలకు విస్తరించి లాభాలు ఆర్జిస్తున్నారు. ఇష్టంగా పనిచేస్తూ, విజయాలను అందుకుంటూ ఏపీ ప్రభుత్వం నుంచి జిల్లా ఉత్తమ మహిళా రైతుగా అవార్డును సాధించారు.

జెర్బారా డైసీ పూలసాగులో... ఉత్తమ రైతుగా రాణిస్తున్న మహిళ
జెర్బారా డైసీ పూలసాగులో... ఉత్తమ రైతుగా రాణిస్తున్న మహిళ

By

Published : Dec 19, 2020, 2:03 PM IST

ఆంధ్రప్రదేశ్​ కర్నూలులోని నంద్యాల, సలీంనగర్‌కు చెందిన జె.వినతాదేవి జెర్బారా డైసీ పూలసాగు చేస్తున్నారు. కాంతినగర్‌లో తనకున్న 40 సెంట్ల స్థలంలో పాలీహౌస్‌ను నిర్మించి డ్రిప్‌ విధానంలో సాగు చేపట్టారు. మూడేళ్ల క్రితం పూణె నుంచి మొక్కలు తెప్పించుకున్నారు. యూట్యూబ్‌లో చూసి...ప్రత్యేకంగా ఎర్రమట్టిని ఉపయోగించి జెర్బారా డైసీ పూలసాగు మెుదలు పెట్టారు. ఉద్యానవన అధికారులను కలిసి తన ప్రాజెక్టును సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం కిందకు తీసుకువచ్చారు. దీంతో రూ.10 లక్షల వరకు రాయితీ లభించింది. పాలీహౌస్‌ నిర్మాణంతో పాటు మొక్కల సాగు, డ్రిప్‌ విధానానికి మొత్తం రూ.22 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. చుట్టుపక్కల ప్రాంతాల పూలవ్యాపారులు.. జెర్బారా డైసీ పూల కోసం బెంగళూరు, హైదరాబాద్‌ లాంటి ప్రాంతాలకు వెళ్లకుండా నంద్యాలలోనే కొనుగోలు చేస్తున్నారు.

ధైర్యంతో ముందుడగు

రాయలసీమలోని వాతావరణానికి జెర్బారా డైసీ పూలసాగు సరిపోదని ఉద్యానవనశాఖ అధికారులు వినతాదేవికి చెప్పారు. అయినా ఆమె పట్టించుకోకుండా... ధైర్యంగా ముందుకు సాగారు. హైదరాబాదు సమీపంలోని చెవ్వాలి ప్రాంతంలో మల్లారెడ్డి అనే వ్యక్తి నుంచి సూచనలు తీసుకున్నారు. లాక్‌డౌన్‌లో ఆరునెలల పాటు వ్యాపారం లేకపోయినా వచ్చిన పూలదిగుబడులను ఆలయాలకు ఉచితంగా పంపించారు. ఎరువులతో తెగుళ్లను నివారణతో పాటు వారానికి రెండుసార్లు మొక్కలకు నైట్రోజన్‌, కాల్షియం పిచికారీ చేస్తున్నారు. అంతర్జాలం ద్వారా వివిధ నగరాల నుంచి ఆర్డర్లు వస్తుండటంతో అక్కడికీ ఎగుమతి చేస్తున్నారు. శుభకార్యాల సమయంలో ఒక్కొక్క పువ్వు రూ.10 వరకు విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడిలో 50 శాతం రాయితీ రూపంలో రాగా, రూ.6 లక్షల వరకు పూలసాగుతో ఆదాయాన్ని ఆర్జించారు. ఆమె వినూత్నసాగును గుర్తించి జిల్లాస్థాయిలో ఉత్తమ మహిళా రైతు అవార్డును 2019లోరాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details