స్త్రీలను పారిశ్రామిక వేత్తలుగా ప్రోత్సాహించే జేసీఐ.. బంజారా మేళాను హైదరాబాద్లో ఏర్పాటు చేసింది. ఏటా నిర్వహించే బంజారా మేళాను నాంపల్లిలో ప్రారంభించారు. రెండు రోజులు జరిగే ఈ మేళాలో 185 స్టాల్లను ప్రదర్శించారు. పలు రాష్ట్రాల వనితలు మేళాలో పాల్గొన్నారు. చీరలు, దుస్తులు, ఆభరణాలు, గృహోపకరణలు, రాఖీలు తదితర వస్తువులు ఈ కేంద్రాల్లో కనువిందు చేస్తున్నాయి. మహిళల సాధికారతే లక్ష్యంగా ఈ మేళా నిర్వహిస్తున్నట్లు జేసీఐ బంజారా ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బుతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు, బస్తీలలో మంచి నీటి కోసం, పేద పిల్లల పెళ్లిలకు, దివ్యాంగుల చదువు కోసం ఉపయోగించనున్నట్లు చెప్పారు.
ఆకట్టుకుంటున్న బంజారా మేళా - నాంపల్లి
మహిళలను పారిశ్రామిక వేత్తలుగా ప్రోత్సహించే జేసీఐ.. బంజారా మేళాను హైదరాబాద్లో ఏర్పాటు చేసింది. 185 స్టాల్లను ప్రదర్శిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే డబ్బును సమాజ సేవకు కేటాయించనున్నట్లు జీసీఐ ప్రతినిధులు తెలిపారు.
ఆకట్టుకుంటున్న బంజారా మేళా