తెలంగాణ

telangana

ETV Bharat / state

'ద.మ. రైల్వేలో మహిళా ఉద్యోగులది కీలకపాత్ర' - South central railway Women employees news

దక్షిణ మధ్య రైల్వేలో పలు విభాగాల్లో పనిచేస్తున్న 150 మంది మహిళా ఉద్యోగులను దక్షిణ మధ్య రైల్వే మహిళ సంక్షేమ సంస్థ (ఎస్​సీఆర్​డబ్యూడబ్యూఓ) సత్కరించింది. ఈ కార్యక్రమానికి ఎస్​సీఆర్​డబ్యూడబ్యూఓ అధ్యక్షురాలు జయంతి మాల్యా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

'ద.మ. రైల్వేలో మహిళా ఉద్యోగులది కీలకపాత్ర'
'ద.మ. రైల్వేలో మహిళా ఉద్యోగులది కీలకపాత్ర'

By

Published : Feb 3, 2021, 8:17 PM IST

దక్షిణ మధ్య రైల్వేను ఉన్నత స్థితిలో నిలపడంలో మహిళ ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారని కొనియాడారు దక్షిణ మధ్య రైల్వే మహిళ సంక్షేమ సంస్థ అధ్యక్షురాలు జయంతి మాల్యా. ద.మ. రైల్వేలో పలు విభాగాల్లో పనిచేస్తున్న 150 మంది మహిళా ఉద్యోగులను ఆమె సత్కరించారు. అంకితభావంతో విశిష్ఠ సేవలందించిన మహిళా ఉద్యోగులను గుర్తించి సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. సికింద్రాబాద్​ సంచాలన్ భవన్​లో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ద.మ. రైల్వేలో మహిళలు అన్ని శాఖల్లో పనిచేస్తూ... సంస్థకు మంచిపేరు తీసుకొస్తున్నారని జయంతి మాల్యా కొనియాడారు. ఎలాంటి వివక్షకు తావు లేకుండా మహిళలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నారని ద.మ.రైల్వే జీఎం గజానన్ మాల్యాకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ద.మ. రైల్వే కోశాధికారి ఉషా జైన్, జాయింట్ సెక్రెటరీ అరుణా విశ్వనాథ్ పలువురు అధికారులు, మహిళా ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:తక్కువ ధరకే ఇసుక... అయినా ఆదరణ కరవు

ABOUT THE AUTHOR

...view details