తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదారాబాద్​లో మహిళ అనుమానాస్పద మృతి - స్టార్ ఆసుపత్రి

హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతిచెందింది. మృతురాలి బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు.

star Hospital

By

Published : Jul 3, 2019, 10:14 AM IST

హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతిచెందింది. రాత్రి 12 గంటలకు టౌలీచౌక్ లోని బృందావని కాలనీకి చెందిన షాజాహాన్ బేగం (60) బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఉన్న స్టార్ ఆసుపత్రికి వైద్యం నిమిత్తం తీసుకొచ్చారు. అక్కడి నుంచి మరో ఆసుపత్రికి అంబులెన్స్​లో తీసుకెళ్తుండగా... అందులో ఉన్న టెక్నిషియన్ ఆమె మరణించిందని చెప్పడం వల్ల... తిరిగి స్టార్ ఆసుపత్రికి తీసుకొచ్చి ఆందోళనకు దిగారు. స్టార్ ఆసుపత్రి సిబ్బంది మాత్రం ...ఆమె బతికి ఉండగానే... అప్పగించామని చెబుతున్నారు. మృతురాలి బంధువులు మాత్రం చనిపోయిన తర్వాత అప్పగించారని వాదించారు. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తతతో... పోలీసులు వచ్చి వారిని సముదాయించారు. ఇరువర్గాల నుంచి ఫిర్యాదు తీసుకుని విచారణ జరుపుతున్నట్లు పశ్చిమ మండలం డీసీపీ ఎ.ఆర్​ శ్రీనివాస్​ తెలిపారు.

హైదారాబాద్​లో ఓ మహిళ అనుమానస్పద మృతి

ABOUT THE AUTHOR

...view details