కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఎస్సీ, మహిళా వ్యతిరేక విధానాలను వీడే వరకూ కాంగ్రెస్ రాజీలేని పోరాటం చేస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.ఎస్సీ, ఎస్టీ, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులకు వ్యతిరేకంగా హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్ మహిళా కాంగ్రెస్, ఎస్సీ కాంగ్రెస్ విభాగం సంయుక్తంగా నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. సామాజిక న్యాయం కోసం హస్తం పార్టీ పోరాడుతుందని తెలిపారు. దాడులకు గురైన మహిళా, గిరిజన, ఎస్సీ వర్గాల బాధితులకు కాంగ్రెస్ అండగా నిలిచి మద్దతుగా పోరాటం చేస్తుందన్నారు.
న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
అత్యాచారాలు, దాడులకు గురైన ఎస్సీ, గిరిజనులు, మహిళలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు ఎస్సీ, ఎస్టీ, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులకు వ్యతిరేకంగా హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్ మహిళా కాంగ్రెస్, ఎస్సీ కాంగ్రెస్ విభాగం సంయుక్తంగా నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు.
ఎస్సీ, గిరిజనులు, మహిళలకు న్యాయం జరిగే వరకూ న్యాయ, ఆర్థికపరంగా సంపూర్ణ సహకారం అందిస్తుందని వివరించారు. ఎస్సీలు, మహిళలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీలు, మహిళల హక్కుల కోసం పోరాటం చేయడం మన దౌర్భాగ్యమన్నారు. నాడు తెలంగాణ కోసం మహిళలు, ఎస్సీలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారని చెప్పారు. ఈ ప్రభుత్వం మహిళా కమిషన్ ఏర్పాటు చేయకపోవడంపై మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద ప్రశ్నించారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాష్ట్రంలోని తెరాస ప్రభుత్వం అనుసరిస్తున్న ఎస్సీ మహిళా వ్యతిరేక విధానాలు ఒకే విధంగా ఉన్నాయని ఆరోపంచారు.
ఇదీ చదవండి:ఫినిక్స్ ఆర్ట్ ఎగ్జిబీషన్ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్