రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ను ఈనెల 31లోగా నియమించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ నియమించలేకపోతే తదుపరి విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
కరీంనగర్‌కు చెందిన సామాజిక కార్యకర్త రేగులపల్లి రమ్య రావు రాసిన లేఖపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. మహిళ కమిషన్ ఏర్పాటు చేయాలని గతంలో కోరినప్పటికీ... ఎందుకు నియమించలేదని హైకోర్టు ప్రశ్నించింది.