తెలంగాణ

telangana

ETV Bharat / state

విమెన్స్ డే స్పెషల్: బైక్ రైడింగ్​తో రఫ్పాడిస్తున్న యువతులు - తెలంగాణ వార్తలు

బైక్ రైడింగ్ అంటే కేవలం మగాళ్లకు మాత్రమే పరిమితం కాదంటున్నారు ఈ యువతులు. నిండైన ఆత్మవిశ్వాసంతో రయ్​ రయ్​మంటూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే వేలాది కిలోమీటర్లు అతివలు రైడ్ చేసి మగవారికేం తక్కువ కాదని నిరూపిస్తున్నారు. చిన్నతనంలో సరదా కోసం నేర్చుకున్న ఆ అభిరుచిని పెళ్లయ్యాక కూడా కొనసాగిస్తున్నారు. అవలీలగా స్వారీ చేస్తున్న బైక్​ రాణుల అనుభవాలను తెలుసుకుందాం రండి...

women-bike-ride-on-international-womens-day-celebrations
రయ్ ​రయ్​మంటున్న బైక్ రాణులు.. అవలీలగా అతివల స్వారీ!

By

Published : Mar 8, 2021, 8:13 PM IST

విమెన్స్ డే స్పెషల్: బైక్ రైడింగ్​తో రఫ్పాడిస్తున్న యువతులు

నేల నుంచి నింగి వరకు అన్నీ తామై దూసుకెళ్తోన్న అతివలు... బైక్ రైడింగ్​లో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. మగాళ్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా రహదారులపై రయ్ రయ్​మంటూ పరుగులు తీస్తున్నారు. నిండైన ఆత్మవిశ్వాసంతో బండెక్కి జోరు చూపిస్తున్నారు. వాయువేగంతో సరిహద్దులను దాటుకుంటూ లోకాన్ని చుట్టేస్తున్నారు. చిన్నతనంలో సరదాగా నేర్చుకున్న ద్విచక్రవాహనం... పెరిగి పెద్దాయ్యాక కూడా ఆ అభిరుచిని కొనసాగిస్తున్నారు.

కొందరు సరదా కోసం బైక్ రైడింగ్ చేస్తే... మరికొందరు అవసరాల రీత్యా బండి బయటకు తీస్తున్నారు. రద్దీగా ఉండే ట్రాఫిక్​లోనూ అవలీలగా అతివలు దూసుకెళ్తూ అవతలివారిని అవాక్కయ్యేలా చేస్తున్నారు. అలాంటి కొంతమంది యువతులను ఈటీవీ భారత్ పలకరించింది. బైక్​ రాణుల అనుభవాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం..

ఇదీ చదవండి:ఈ నీళ్లు తాగితే కరోనా‌ దరిచేరదట...!

ABOUT THE AUTHOR

...view details