తెలంగాణ

telangana

ETV Bharat / state

Crime News: 150 తులాల బంగారం చోరీ.. ఇద్దరు మహిళల అరెస్ట్ - సీపీ ఆనంద్ ప్రెస్​మీట్

Women Arrested For Stealing Gold: హైదరాబాద్​లోని ఎస్​ఆర్​నగర్​లో ఓ అపార్టమెంట్​లో పనిలోకి చేరిన ఇద్దరు మహిళలు ఆ ఇంట్లో ఉన్న బంగారాన్ని చోరీ చేశారు. ఈ దొంగతనానికి సహాకరించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల పట్టుకున్న వారిలో దొంగతనం చేసిన మహిళ ఒకరు ఉన్నారు. మరొకరు పరారీలో ఉన్నరని పోలీసులు తెలిపారు.

Women Arrested
Women Arrested

By

Published : Apr 24, 2023, 8:09 PM IST

Women Arrested For Stealing Gold: హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన భారీ దొంగతనం కేసులో ఇద్దరు మహిళలను అరెస్టు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. పని చేయడానికి వచ్చి ఆ ఇంట్లోనే ఏమి ఉన్నాయో పూర్తిగా తెలుసుకున్నారు. అనంతరం సరైన సమయం కోసం ఎదురు చూసి పని ఇచ్చిన యజమాని బంగారాన్ని దొంగతనం చేసి పారిపోయారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. దర్యాప్తు చేశారు. దీంతో వారిలో ఇద్దరు నిందితులను పట్టుకున్నారు.

పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్​లోని ఎస్​ఆర్​నగర్​లో రామ్ నారాయణ ఇంటిలో సునీతా, పూజా అనే మహిళలు ఏప్రిల్ రెండో తేదీన పనికి చేరారు. వారు పనిలోకి చేరిన రోజే యజమాని బయటకు వెళ్లిన సమయంలో.. ఇంటిలో ఉన్న మహిళపై కంట్లో కారం చల్లారు. అనంతరం ఆ ఇంట్లో ఉన్న 150 తులాల బంగారాన్ని దీని విలువ సుమారు రూ.60 లక్షలు దొంగిలించారు. వారు నగలతో సహా ముంబయికి పారిపోయారు.

ఈ చోరీ కేసులో నిందితులకు సాయం చేసిన మరో ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు. వారిని త్వరలో పట్టుకుంటారని అన్నారు. ఇంట్లో పని పెట్టుకునే ముందు ఆ వ్యక్తుల పూర్తి వివరాలు తెలుసుకోవాలని సలహా ఇచ్చారు. పనిలోకి చేర్చుకునే ముందు కనీసం వారి ఆధార్ కార్డు, రేషన్ కార్డు.. ఇలాంటి వివరాలు తెలిపే వాటిని పరిశీలించాలని కోరారు. ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. తాము ఎన్నిసార్లు చెప్పిన వినిపించుకోవట్లేదని అన్నారు. తదుపరి దర్యాప్తులో మిగిలిన నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు.

"ఎటువంటి వివరాలు తీసుకోకుండా వ్యక్తులను పనిలోకి చేర్చుకోవడం వల్ల ఈ చోరి జరిగింది. పరిచయం లేని వ్యక్తలను ఇంట్లో పని కోసం పెట్టుకోడం చాలా ప్రమాదం. ఎస్​ఆర్​నగర్​లోని శాంతిభాగ్​లోని ఓ అపార్డ్​మెంట్​కి సంబంధించిన రామ్ నారాయణ ఇంట్లో నిందితులు దొంగతనం చేశారు. నిందితులు ఇద్దరిది వేరే వేరే రాష్ట్రాలు అయిన వారికి పరిచయం ఉంది. వారు పథకం ప్రకారమే ఈ చోరీ చేశారు. ఈ కేసులో సనీతా, పూజాని అరెస్ట్ చేశాం. మరో నిందితురాలు మహారాష్ట్రకి చెందిన మహాదేవి రాజేశ్ కల్లాల్​ పరారీలో ఉంది."-సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ

150 తులాల బంగారం చోరీ.. ఇద్దరు మహిళల అరెస్ట్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details