తెలంగాణ

telangana

ETV Bharat / state

విమెన్స్‌ డే స్పెషల్‌: అన్నింట్లో ముందున్నాం.. మరెందుకీ వివక్ష.? - international women's day special story

మార్చి 8.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా మహిళలను గౌరవించుకునే రోజు. విభిన్న రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళామణులను ఈ రోజు సత్కరించుకుంటాం. ఆడదానివి నీకేం తెలుసు అనే మాట నుంచి.. వాళ్లకు తెలియనిది ఏం లేదు అని నిరూపించుకునే స్థాయికి స్త్రీ ఎదిగింది. మరి ఆ మగువను అన్ని రోజులు అలాగే గౌరవిస్తున్నామా అంటే మనస్ఫూర్తిగా ఏ ఒక్కరి దగ్గరా సమాధానం ఉండదు. ప్రతిభలోను, శక్తి సామర్థ్యాల్లోను తనకంటూ ప్రత్యేక గుర్తింపున్నా.. వారిపై లింగ వివక్ష ఇంకా ఎందుకు కొనసాగుతోంది. తాను అడుగుపెట్టిన ప్రతి రంగంలో ఎందుకని లైంగిక వేధింపులు ఎదుర్కొంటోంది.

international women's day
అంతర్జాతీయ మహిళా దినోత్సవం

By

Published : Mar 8, 2021, 10:40 AM IST

రోజుల్లో కూడా ఆడపిల్లకు.. ఇంకా చదువెందుకు పెళ్లి చేసి పంపండనే డైలాగులు ప్రతీ ఇంట్లో వింటూనే ఉన్నాం. ఊహ తెలిసిన నాటి నుంచి జీవితంపై ఎన్నో ఆశలతో స్త్రీ ముందుకు అడుగేస్తుంది. అమ్మానాన్నలను, తోబుట్టువులను అపురూపంగా చూసుకోవాలని కలలు కంటుంది. పెళ్లి చేసుకుని తన జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తుంది. వారితో ఏ రక్త సంబంధం లేకపోయినా కన్నవారితో సమానంగా ఆప్యాయతను పంచుతుంది. అందరిలోను సాటి మనిషిని చూస్తూ నిస్వార్థంతో ప్రేమను పంచుతున్న 'ఆమె'పై ఇంటా బయటా అనే తేడా లేకుండా వేధింపులు కొనసాగుతున్నాయి.

అవకాశం కోసం

కష్టపడి సాధించిన కొలువులో లైంగిక వేధింపులు ఎదుర్కొంటోంది. వారిలో ఆత్మస్థైర్యం కోల్పోయేలా చేస్తుంది. ఉన్నత పదవులకు సరిపడా నైపుణ్యాలు ఉన్నా.. ఆడదానివి నువ్వు ఎలా చేయగలవనే వంకతో తిరస్కరిస్తున్నారు. దేశరాజకీయాలనే శాసించిన వాళ్లకు.. ఇది అంత కష్టమైన పని కాదని వాళ్లకు తెలియదేమో.!

నచ్చిన డ్రెస్‌ వేసుకుంటే బరితెగించి పోయిందని విమర్శలు.. సాంప్రదాయబద్ధంగా ఉంటే సత్తెకాలపు మనిషని కామెంట్లు. లింగ సమానత్వాన్ని సమాజానికి చాటిచెప్పేందుకు ఐక్యరాజ్యసమితి మార్చి 8 న మహిళా దినోత్సవాన్ని ప్రకటించి శతాబ్ది గడిచినా ఆ సమానత్వం ఇంకా పరిపూర్ణ స్థాయికి చేరలేదనే చెప్పాలి. తమతో పాటు అదే స్థాయిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను సాటి మనిషిలా కాకుండా ఒక సెక్స్‌ డాల్‌గా చూడటమే ఇందుకు నిదర్శనం.

ఇంట్లోనే రక్షణ కరవు

మహిళల కోసం ప్రభుత్వాలు నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఎన్ని తెచ్చినా అవి తూతూ మంత్రంగానే పనిచేస్తున్నాయి. ఏ సంబంధం లేని మనుషుల మధ్య స్త్రీకి రక్షణ లేకుండా పోతోందని భయంతో కొందరు తల్లులు పెళ్లిళ్లయ్యే వరకూ ఇంటిపట్టునే ఉండనిస్తున్నారు. కానీ.. రక్తం పంచిన నాన్నే.. బలిపశువుగా మారితే.. బాధ్యత తీసుకోవాల్సిన అన్నదమ్ములే రాక్షసుల్లా ప్రవర్తిస్తే.. పశువాంఛతో వావివరుసలు మరిచి అఘాయిత్యాలకు పాల్పడుతుంటే వారింక ఎవరికి చెప్పుకోవాలి. గతంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కూడా ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయంటే ఈ దేశంలో మహిళ పరిస్థితి ఏలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అర్ధరాత్రి కాదు కదా పగిటిపూట ఆడది నిర్భయంగా వెళ్లే రోజుల్లేవు.

విమెన్‌ ఇన్‌ లీడర్‌షిప్‌

ప్రతి యేటా ఒక సిద్ధాంతంతో మహిళా దినోత్సవాన్ని నిర్వహించే ఐక్యరాజ్యసమితి ఈ ఏడాది విమెన్‌ ఇన్‌ లీడర్‌షిప్‌ అంటూ కొవిడ్‌ కష్టకాలంలో వారు చేసిన కృషిని సమాజానికి పరిచయం చేసింది. అలాగే సమాజం కూడా మహిళను ఓ మనిషిగా గుర్తించి... తమ అభీష్టానికి అడ్డు రాకుండా ఉంటే ఎన్నో అద్భుతాలు సృష్టించగలరు.

పాలిచ్చి పెంచిన తల్లులు సార్‌.. పాలించడం ఓ లెక్కా.! వీళ్లతో పోల్చుకుంటే మనకేం తెలుసు.. తొడ గొట్టడాలు.. మీసాలు తిప్పడాలు తప్ప.!అని ఓ సినీ నటుడు అన్నట్లుగా ప్రతి పురుషుడు ఇలాగే ఆలోచిస్తే మహిళా దినోత్సవానికి వారికి మనం ఇచ్చే కానుక ఇదే.!

ఇవీ చదవండి:విమెన్స్​ డే స్పెషల్: మానవి స్వేచ్ఛకు పడుతున్న సంకెళ్లేంటి..?

అది జరిగినప్పుడే నిజమైన మహిళా దినోత్సవం..!

విమెన్స్ డే ప్రత్యేకం: ఇలా చేస్తే అన్నింటా మనమే రాణులం!

ABOUT THE AUTHOR

...view details