ఏపీలోని గుంటూరు కలెక్టరేట్‌కు వచ్చిన ఓ మహిళ.. జగన్ ప్రభుత్వంపై చేసిన విమర్శలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తాడికొండ మండలం కంతేరుకు చెందిన కె.వెంకాయమ్మ.. భూ వివాదంపై ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్‌కు వెళ్లారు. భూమిని సర్వే చేసి ఎవరిది ఎంతవరకో తేల్చాలని స్పందన కార్యక్రమంలో అర్జీ అందజేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ పథకాలు పేదప్రజలకు మేలు చేసేలా లేవని వ్యాఖ్యానించారు. అన్నా క్యాంటీన్లు తీసేయటం, రంజాన్-క్రిస్మస్ కానుకల్ని ఎత్తేయటం సరికాదంటూ తనదైన రీతిలో చెబుతూ జగన్ మండిపడ్డారు.
Video Viral: ముఖ్యమంత్రిపై మహిళ కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్ - comments on cm jagan at guntur collectorate
Women Angry On CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై ఓ మహిళ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ పథకాలు.. పేద ప్రజలకు మేలు చేసేలా లేవని ఆమె వ్యాఖ్యానించారు. వైకాపా ప్రభుత్వంపై గుంటూరు కలెక్టరేట్లో మహిళ చేసిన విమర్శలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Video Viral