ఖమ్మం జిల్లాలో హత్యాచారయత్నానికి గురైన బాలికను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని స్త్రీ శిశు సంక్షేమశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పద్మజ అన్నారు. బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ చిన్నపిల్లల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను ఆమె పరామర్శించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
'బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది' - హైదరాబాద్ తాజా సమాచారం
ఖమ్మం జిల్లాలో హత్యాచారయత్నానికి గురై హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న బాలికను స్త్రీ శిశు సంక్షేమశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పద్మజ పరామర్శించారు. బాధితురాలి వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని ఆమె తెలిపారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలుస్తుందన్నారు.
!['బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది' Women and Child welfare additional director visits rainbow hospital in banjarahills](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9140192-18-9140192-1602436589616.jpg)
' బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది'
బాలిక ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆమె తెలిపారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు బాలిక ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారని పద్మజ వెల్లడించారు.